Home సినిమాలు 'లైగ‌ర్'లో కీలక పాత్ర పోషించేదెవరంటే..?

‘లైగ‌ర్’లో కీలక పాత్ర పోషించేదెవరంటే..?

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలోరౌడీ హీరో విజయ్‌ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం ‘లైగర్’‌. ఈ సినిమాలో ఫైటర్‌గా కనిపించనున్న విజయ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. చార్మీ, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్ర‌వ‌రి 11 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది. సాధారణంగా పూరీ జగన్నాథ్  ప్ర‌తీ సినిమాలో స్టార్ కమెడియన్ అలీ ఉంటాడ‌న్న సంగతి తెలిసిందే. అయితే లైగ‌ర్ లో కూడా అలీ కోసం ఓ కీలక పాత్రని రూపొందించాడట పూరీ. లైగ‌ర్ లో అలీ పాత్ర కథను మలుపుతిప్పేదిగా ఉంటుంద‌ని సమాచారం. 

ఇదిలావుంటే.. కరణ్ జోహార్ లాంటి భారీ చిత్రాల నిర్మాత ‘లైగర్’ ప్రాజెక్ట్‌లోకి రావడంతో బాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. మరోవైపు వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ డిజాస్టర్‌ కావడంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసి మీదున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే మళ్లీ పూర్తిస్థాయిలో ప్రేమ కథల జోలికి వెళ్లకుండా కొంత వినూత్నంగా లైగర్‌తో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌ కథను ఎంచుకున్నాడు.Attachments area

అత్యంత ప్రముఖమైనవి

‘గ‌జ‌కేస‌రి’గా వస్తోన్న కేజీఎఫ్ ఫేమ్ యశ్.. ఆకట్టుకుంటున్న టీజర్

క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యువ హీరో యశ్. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ప్ర‌తి సినిమాను జాతీయ మీడియా...

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఇటీవలి వ్యాఖ్యలు