Home సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ‘ఉప్పెన’ సంచలనం… మెగాహీరో రేంజ్ అదరహో!

ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ‘ఉప్పెన’ సంచలనం… మెగాహీరో రేంజ్ అదరహో!

యువ నటీనటులు వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు.విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. కాగా,ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ‘ఉప్పెన’ గతేడాది విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అయితే, భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ‘ఉప్పెన’ మూవీ రిలీజ్ కు ముందే దుమ్మురేపుతోంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసిన తర్వాత ఔరా అంటున్నారంతా. నైజాం, సీడెడ్, కోస్తాంధ్రా అన్ని చోట్ల కూడా ఉప్పెనకు మంచి బిజినెస్ జరిగింది. దాంతో చిత్రబృందం చాలా సంతోషంగా  ఉన్నారు. 2021లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఉప్పెనదే హైయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ కావడం విశేషం.గతేడాది లాక్ డౌన్ సమయంలో ఉప్పెన సినిమాకు ఓటీటీల నుంచి భారీ ఆఫర్స్ వచ్చాయి. దాదాపు 20 కోట్లకు ఔట్ రేట్ ఇచ్చేయాలంటూ నెట్ ఫ్లిక్స్ చాలా రోజుల పాటు రిక్వెస్ట్ చేసింది. అయినా కూడా ఎవరికీ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇప్పుడు థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. 

కాగా..’ఉప్పెన’ సినిమాకు ఇప్పటి వరకు 22 కోట్ల బిజినెస్ జరిగింది. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్‌లో 22 కోట్ల షేర్ వసూలు చేయడం అంత సులువైన విషయం కాదు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు చిత్రయూనిట్. అలాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించాడు. దాంతో తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అక్కడ కూడా మంచి వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది.

అత్యంత ప్రముఖమైనవి

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

గింగిరాల పిచ్ పై భారత్ వికెట్ల తేడాతో విజయం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ స్టేడియం లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవది మరియు...

ఇటీవలి వ్యాఖ్యలు