‘లక్ష్మీ కళ్యాణం’తో టాలీవుడ్‌కి పరిచయమైన కాజల్ అగర్వాల్ తమిళ్, హిందీ భాషల్లోనూ దూసుకెళ్తుంది.గతేడాది అక్టోబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. సడెన్‌గా కాజల్ తన ప్రేమ, పెళ్లి విషయం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేయడంతో వీరిద్దరి టాపిక్ కొంతకాలం వరకు టాలీవుడ్లో సెన్సేషనల్‌గా మారింది. పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే చందమామ చేతిలో.. చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ భారతీయుడుతో పాటు హిందీలో ‘ముంబాయి సాగా’ సినిమాలో నటిస్తోంది. సినిమాలతోపాటు కాజల్ తన వ్యక్తిగత జీవితానికి కూడా ఎక్కవగానే ప్రధాన్యతే ఇస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా భర్త గౌతమ్‌తో సమయం గడుపుతోంది. అంతేగాక ఇప్పుడిప్పుడే తన విషయాలను బయటకు వెల్లడిస్తోంది.
ఇదిలావుండగా..కాజల్‌కు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు బ్రాంకియల్ ఆస్తమా బారినపడిందట. దీని వలన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చేదట. శీతాకాలం వస్తే బ్రాంకియల్ ఆస్తమా లక్షణాలు మరింత ఎక్కవు కావడంతో తాను చాలా ఇబ్బందులు పడినట్టు చెప్పుకొచ్చింది కాజల్. అయితే బ్రాంకియల్ ఆస్తమా నుండి బయట పడేందుకు ఇన్హేలర్ వాడగా, అది బాగా పని చేసిందని కాజల్ పేర్కొంది. అయితే, ఇప్పటికీ నా వెంట ఓ ఇన్హేలర్ ఉంటుంది. మనదేశంలో చాలా మందికి కూడా ఇన్హేలర్ అవసరం ఉంటుంది. కాని దానిని వాడడానికి సిగ్గుపడుతుంటారు. ఎవరు ఏమనుకుంటారో అని ఫీల్ అవుతుంటారు. వాటికి స్వస్తి చెబుదాం, సే ఎస్ టు ఇన్ హేలర్స్ అందాం అని సోషల్ మీడియాలో కాజల్ పేర్కొంది. కాగా,పుత్తడి బొమ్మలా కనిపించే కాజల్ వెనుక ఇంతటి విశాడగాథ ఉందని తెలిసి.. అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు.