Home సినిమాలు అల్లు అర్జున్‌ ఖాతాలో ‍మరో అరుదైన రికార్డు

అల్లు అర్జున్‌ ఖాతాలో ‍మరో అరుదైన రికార్డు

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అల..వైకుంఠపురుములో’ 2020 సంక్రాంతి కానుగా వచ్చిన ఈ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలసిందే. కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం బన్ని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమా మ్యూజికల్‌గా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ పాట ఓ ఆణిముత్యంగా నిలిచింది. ముఖ్యంగా ‘రాములో రాములా’ సోషల్‌ మీడియాలో ఎంతటి ట్రెండ్‌ సృష్టించిందో తెలిసిందే.

తాజాగా ‘రాములో రాములా’ పాట మరో రికార్డును అందుకుంది. యూత్‌ను ఉర్రూతలూగించిన ఈ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో 300 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ పాటను తమన్‌ కంపోజ్‌ చేయగా అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్‌ అందించిన సాహిత్యం పాటకు మరింత వన్నె తెచ్చింది. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సుశాంత్‌, నివేదా పేతురాజు, మరళీ శర్మ, టబు తదితరులు నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించింది.

అత్యంత ప్రముఖమైనవి

ఐదుగురు అమ్మాయిల ప్రయాణం – సీత ఆన్ ది రోడ్

క్రియేటివిటీ కి బౌండరీలు లేవు.  ఎవరైనా తమ క్రియేటివ్ ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకు రావచ్చు.  అందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఎంత గానో ఉపయోగ పడుతున్నాయి. ...

ఘంటసాల భగవద్గీత… ఇన్ఫోటైన్మెంట్ గురు” యూట్యూబ్ ఛానల్ లో

ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి సమస్యకు పరిష్కారం భగవద్గీత లో దొరుకుంది.   ఘంటసాల భగవద్గీత శ్లోకాల తాత్పర్యం తో సహా మీ కోసం. “ఇన్ఫోటైన్మెంట్ గురు”...

ఆ సూపర్ ‘హిట్’ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని..

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై యువ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం 'హిట్‌'. 'ది ఫ‌స్ట్ కేస్‌' ట్యాగ్ లైన్‌. శైలేష్...

నిత్యా మీనన్ “నిన్నిలా నిన్నిలా” నేరుగా ఓ టి టి లో

నిత్యా మీనన్, రీతూ వర్మ, అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల లో నటించిన " నిన్నిలా నిన్నిలా " చిత్రం నేరుగా జీ ప్లెక్స్ లో ఫిబ్రవరి 26 న...

ఇటీవలి వ్యాఖ్యలు