కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కన్నడ సినిమా స్టామినాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లి దర్శకుడు ఈయన. తొలి సినిమా ‘ఉగ్రం’తో బ్లాక్ బస్టర్ అందుకుని తానేంటో నిరూపించుకున్నారు. ఇక రెండో సినిమాతో జాతీయ స్థాయిలో గర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘సలార్’తో బిజీగా ఉన్నారు. అయితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ఈ మధ్య ప్రశాంత్ నీల్ ఊతమిచ్చారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా “నూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. నెక్ట్స్ టైమ్ ఎన్టీఆర్ క్రేజీ ఎనర్జీ చుట్టూ నా రేడియేషన్ సూట్‌ను తీసుకొస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్ ఈరోజు మీకు ఎంతో సురక్షితంగా, గొప్పగా ఉండాలి. త్వరలోనే కలుద్దాం’’ అని తన ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు.
అలాగే ఇటీవల ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. గతేడాది జూన్ 4న ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘స్టార్ డైరెక్టర్,అద్భుతమైన వ్యక్తి ప్రశాంత్ నీల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. త్వరలోనే రేడియేషన్ సూట్లో కలుసుకోవాలని వేచి చూస్తున్నాం’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తరఫున ఒక బర్త్‌డే విషెస్ పోస్టర్ కూడా వదిలారు. దాంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ సినిమాను చేయబోతున్నారని సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘రేడియేషన్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ సలార్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నారు. కాగా, ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభించాలని ప్రశాంత్ నీల్ యోచిస్తున్నారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందానకి అవధులు లేకుండా పోయాయి.