నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని నటిస్తోన్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు
కాగా..నాని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. నాని మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ ఫిబ్రవరి 13 నుంచి మొదలు కానుంది. థమన్ కంపోజ్ చేసిన తొలి లిరికల్ వీడియో సాంగ్ “ఇంకోసారి ఇంకోసారి..” ఫిబ్రవరి 13న లాంఛ్ కానుంది. బ్లూ టీషర్టు-వైట్ జీన్ ప్యాంట్ లుక్ లో ఉన్న నాని అందమైన ప్రదేశంలోబండరాయిపై కూర్చొని నీలిరంగు డిజైన్డ్ పంజాబీ డ్రెస్ లో మెరిసిపోతున్న రీతూవర్మ చేయి పట్టుకుని ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఉన్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..నాని-రీతూ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తున్న ఈ స్టిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. సాంగ్ పోస్టర్ చూస్తుంటే నాని-రీతూ కాంబినేషన్ లోని ఈ పాట సంగీత అభిమానుల్ని ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలావుండగా..నాని హీరోగా నటించిన హిట్ మూవీ ‘నిన్నుకోరి’తో పరిచయమై.. రెండో సినిమా ‘మజిలీ’తోనూ సూపర్ హిట్ సాధించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండటంతో ‘టక్ జగదీష్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. టైటిల్‌తోటే ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇదివరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ స్వరాలు కూరుస్తున్న ఈ సినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. వెంకట్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేష్, నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.