అల్లు అర్జున్ – సుకుమార్ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13న ‘పుష్ప’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో బన్నీ స్మగ్లర్ల టీమ్‌కు నాయకుడిగా ఊరమాస్ గెటప్‌లో కనిపించారు. పాన్ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీకి జంటగా రష్మిక సందడి చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది.
కాగా,తాజాగా ‘పుష్ప’ షూటింగ్ గురించి నటి రష్మిక మందన్న స్పందించారు. ‘‘బన్నీతో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మంచి వ్యక్తి, మనసుపరంగా చిన్నపిల్లవాడు. ఆన్‌స్ర్కీన్‌లో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ‘పుష్ప’ ఎంతో విభిన్నమైన చిత్రం. ఈ సినిమా షూటింగ్ వల్ల ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను. తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి లొకేషన్‌కు చేరుకుంటున్నాం. మళ్లీ ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 అవుతోంది. భోజనం, వర్కౌట్లు చేసి నిద్రపోయేసరికి 12 నుంచి ఒంటిగంట అవుతోంది. దానివల్ల కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నాను. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు స్ర్కీన్‌పై చూస్తారు” అని రష్మిక తెలిపారు.