Home సినిమాలు మహేశ్‌కు నమ్రత స్పెషల్ విషెస్: వైరల్‌

మహేశ్‌కు నమ్రత స్పెషల్ విషెస్: వైరల్‌

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఆయన సతీమణి నమ్రత నేడు 16వ వివాహ వార్షికోత్సంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో నమ్రత మహేశ్‌తో  దిగిన ఓ అపురూప చిత్రాన్ని ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. తన భర్తకి శుభాకాంక్షలు తెలిపారు. ” మనం వివాహం తర్వాత 16 ఏళ్లు చాలా సులభంగా గడిచిపోయాయి. బలమైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలయికతో మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మహేష్ బాబు. నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాన`ని నమ్రత కామెంట్ చేశారు. మహేష్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు.  

కాగా..’వంశీ’ సినిమాలో వెండితెరపై కలిసి సందడి చేసిన వీరిద్దరూ.. ఆ సినిమా షూటింగ్‌లోనే స్నేహితులుగా మారారు. ఆ తర్వాత కొంతకాలానికే వీరి స్నేహబంధం.. ప్రేమకు.. ఆపై వివాహానికి దారి తీసిన విషయం తెలిసిందే. వివాహానికి ముందు ఎన్నో బాలీవుడ్‌ సినిమాల్లో నటించిన నమ్రత చివరిగా ‘అంజి’ చిత్రంలో చిరంజీవికి జంటగా కనిపించారు. వివాహం తర్వాత ఆమె నటనకు దూరమయ్యారు.

మరోవైపు మహేశ్‌బాబు ప్రస్తుతం స్టార్‌ డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’. చిత్రంలో నటిస్తున్నారు. మహేశ్‌తో ‘మహానటి’ కీర్తి సురేశ్‌ తొలిసారిగా జోడీ కడుతున్నారు. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌, మహేశ్‌బాబు సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఆస్కార్ రేసులో ‘ఆకాశం నీ హ‌ద్దురా’.. పట్టరాని ఆనందంలో అభిమానులు

సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'.  లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య...

ఇటీవలి వ్యాఖ్యలు