Home సినిమాలు దానికోసం గోవా వెళుతోన్న మహేశ్ బాబు..

దానికోసం గోవా వెళుతోన్న మహేశ్ బాబు..

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే ‘సర్కారు వారి పాట’. మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌  నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే దుబాయ్‌లో ప్రారంభమైంది. వెన్నెల కిషోర్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భరత్‌ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సక్సెస్‌ల తర్వాత మహేశ్‌ నటిస్తోన్న లేటెస్ట్‌ చిత్రం కావడంతో సరిలేరు మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. 14 రీల్స్‌ ప్లస్‌, మహేశ్‌బాబు సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

కాగా,ఈ సినిమా ప్ర‌స్తుతం దుబాయ్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎడారి దేశంలో వేసిన ఓ స్పెషల్ సెట్ లో సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లు చిత్రీక‌రించారు. షార్జాలోని బ్యూటీఫుల్ లొకేష‌న్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఫొటోలు ఇప్పటికే వైర‌ల్ అయ్యాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒక‌టి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ గోవాలో ప్లాన్ చేశార‌ని సమాచారం. అంతేకాదు ప‌ర‌శురాం సారథ్యం లోని చిత్రబృందం ఈ సినిమా కోసం గోవాలో స్పెష‌ల్ సెట్ ఒక‌టి వేయ‌నుంద‌ట‌. దుబాయ్ షెడ్యూల్ అయిపోగానే గోవాకు ప‌య‌నం కానుంద‌ని సమాచారం. అయితే,గోవాలో వేయ‌బోయే సెట్‌లో కొన్ని కీల‌క సన్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా..దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

అత్యంత ప్రముఖమైనవి

‘ఆర్‌ఆర్‌ఆర్’‌ క్లైమాక్స్‌: ఎంట్రీ ఇచ్చిన హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్

ప్రముఖ దర్శకడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ఈ సినిమాని అక్టోబర్‌ 13 దసరా పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు...

‘లవ్‌స్టోరి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నాగ చైతన్య చించేస్తున్నాడు బాబోయ్..!

నాగచైనత‍్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా...

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

ఇటీవలి వ్యాఖ్యలు