మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. సుకుమార్ రైటింగ్స్ సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రిగా కీలక పాత్ర పోషించారు. ఈసినిమా ఫిబ్రవరి 12న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తన సోదరుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయి తేజ్ ఒక ట్వీట్ చేశారు.సాయి తేజ్ చేసిన ట్వీట్లో ఒక లేఖను కూడా పొందుపరిచారు. ఈ లేఖను ఎంతో ఎమోషనల్ గా రాశారు సాయి తేజ్. వైషు బాబూ అంటూ తన తమ్ముడిని ముద్దుగా పిలిచిన సాయి తేజ్.. అతడిని చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. తన తమ్ముడికి ఇది ప్రారంభం మాత్రమేనని.. ఇకపై ప్రయాణం అంత సులభంగా ఉండదని సాయి తేజ్ పేర్కొన్నారు.
‘‘నీ సినిమా మొత్తానికి విడుదలవుతోంది వైష్ణవ్ నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నీకు ఈ సమయంలో నీకు చాలా భయంగా, ఆత్రుతగా ఉంటుందని నాకు తెలుసు..ఇది నీ ప్రారంభం మాత్రమే, ఇకపై నీ ప్రయాణం అంత సులభంగా ఉంటుందని నేను హామీ ఇవ్వలేను. కానీ, ప్రేక్షకుల నుంచి నువ్వు ప్రేమను పొందగలవని మాత్రం చెప్పగలను. ఈరోజు నీతోపాటు మా అందరికీ ఎంతో ప్రత్యేకం. ‘ఉప్పెన’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను..’’ అని సాయి తేజ్ తన లేఖలో పేర్కొన్నారు.