రెబల్‌స్టార్ ప్రభాస్ తాజా సినిమా ‘రాధేశ్యామ్’.బాహుబలి తరువాత ప్రభాస్ తీస్తున్న సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. వరుస విడుదలవుతున్న రాధేశ్యామ్ మోషన్ పోస్టర్లు, ఫోటోలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే డార్లింగ్ ఈ సినిమాలో తన లుక్‌తో అందరిని కట్టిపడేశాడు. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది.రాధాకష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అయిదు బాషలలో విడుదల కాబోతుంది.
అయితే,ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్‌ను సంగీత దర్శకుడిగా ఇప్పటికే ప్రకటించారు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాటలు స్వరపరుస్తున్నారు. అయితే, ఇప్పుడు హిందీ ఆల్బమ్‌కు కూడా సంగీత దర్శకులను ఖరారు చేశారు చిత్రబృందం. మిథున్, మనన్ భరద్వాజ్ ‘రాధేశ్యామ్’ హిందీ పాటలు స్వరపరిచారు. వీరిద్దరూ అద్భుతమైన పాటలు అందించారని చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. కాగా,ప్రభాస్ గత చిత్రం ‘సాహో’కు పూర్తిగా బాలీవుడ్‌కు చెందిన సంగీత దర్శకులే పాటలు అందించారు. ఆ పాటలు తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అందుకే, ఈసారి ‘రాధేశ్యామ్’ విషయంలో వ్యూహాన్ని మార్చారు. హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మిథున్, మనన్ భరద్వాజ్‌లను తీసుకొని.. దక్షిణాది ప్రేక్షకుల కోసం జస్టిన్ ప్రభాకరన్‌ను తీసుకున్నారు.
ఇదిలావుండగా, యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.