దర్శకుడు : బుచ్చిబాబునిర్మాత : రవి శంకర్, నవీన్సంగీతం : దేవిశ్రీ ప్రసాద్నటీనటులు : వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి,విజయ్ సేతుపతి
మెగా హీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్‌లో.. ఆయన శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మెగాస్టార్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడి తొలి సినిమా కావడంతో.. వైష్ణవ్ తేజ్ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కూడా ఈ చిత్రానికి దక్కడంతో పాజిటివ్ వైబ్స్‌తో ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 12) థియేటర్స్‌లో విడుదలైంది. విలన్ గా నటించిన విజయ్ సేతుపతి సినిమాకి మరింత హైప్ తీసుకుని రాగా.. హీరోయిన్ కృతి శెట్టి ఎక్స్ప్రెషన్స్ కూడా సినిమాకు ప్రధానమైన బలంగా మారాయి. ఆమె క్యూట్ లుక్స్, పెర్ఫామెన్స్ యూత్‌ని మైమరపించేట్టుగానే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌లో కనిపించాయి. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
ఆశీ(వైష్ణవ్ తేజ్) ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. కానీ అతని బాల్యం నుంచే ఓ భూస్వామి రాయణం(విజయ్ సేతుపతి) కూతురు సంగీత(కృతి శెట్టి)ని ఇష్టపడతాడు. అలా వీరిద్దరూ కూడా ప్రేమించుకుంటారు. కానీ కొన్ని ఊహించని సంఘటనలతో కథ కీలక మలుపు తిరుగుతుంది. మరి ఇక్కడ నుంచి ఈ ఇద్దరి జంట ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రాయణం ఏం చేశాడు? ఆఖరికి వీరి ప్రేమ ఏమయ్యింది అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాల్సిందే.
విశ్లేషణ:
గొప్పింటి అమ్మాయి..పేదింటి అబ్బాయి మధ్య పుట్టిన ప్రేమ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. టాలీవుడ్ లో ఇలాంటి ప్రేమకథలు ఇప్పటి వరకు ఎన్నో వచ్చాయి.’ ఉప్పెన’ కూడా అలాంటి కథతోనే రూపొందింది. ఫస్టాఫ్ లో ఎక్కువ సీన్లు ఆశీ, సంగీత ప్రేమ నేపథ్యంలోనే సాగిపోతాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే, సినిమా స్టోరీ రొటీన్‌గా ఉన్నా కొన్ని సన్నివేశాలు, హీరోహీరోయిన్ల మధ్య లవ్, రొమాన్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా కొత్తగా, బోల్డ్‌గా ఉంది.
ప్లస్ పాయింట్స్ : వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, విజయ్ సేతుపతి నటన, క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ : సాగదీత సీన్లు
రేటింగ్: 3/5