Home సినిమాలు ‘ఎఫ్‌సీయూకే’ మూవీ రివ్యూ:

‘ఎఫ్‌సీయూకే’ మూవీ రివ్యూ:

దర్శకుడు : విద్యాసాగర్ రాజునిర్మాత : కె.ఎల్. దామోదర్ ప్రసాద్సంగీతం : భీమ్స్ సిసిరోలియో

నటీనటులు : జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ,  బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్.

జ‌గ‌ప‌తిబాబు ప్రధాన పాత్రలో విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘FCUK’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌). రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి యువ జంట‌గా.. మ‌రో కీల‌క పాత్రలో బేబి స‌హ‌శ్రిత న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ‌రి టైటిల్ తోనే ఆక‌ర్షించిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
కండోమ్‌ల వ్యాపారంలో కోట్లు సంపాదించిన ఫణి భూపాల్‌(జగపతిబాబు) ప్లేబాయ్‌లా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే అతనికి పూర్తి విరుద్ధంగా కొడుకు కార్తీక్‌(రామ్‌ కార్తీక్‌) ఉంటాడు. అయితే, కార్తీక్‌, ఉమా(అభిరామి) అనే  నిశ్చితార్థం జరిగిన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా కార్తీక్‌ని ఇష్టపడుతుంది. కానీ వీరిద్దరి ప్రేమ చిగురించే క్రమంలో ప్లేబాయ్‌ ఫణి భూపాల్‌ వల్ల జరిగిన ఓ సంఘటనతో కార్తీక్‌ని ఉమా ధ్వేషిస్తుంది. ఆ సంఘటన ఏమిటి? ఫణి భూపాల్‌, కార్తీక్‌, ఉమా జీవితాల్లోకి చిట్టి అనే చిన్న పాప ఎందుకు వచ్చింది? చివరికి కార్తీక్‌, ఉమా కలిశారా? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే.  
విశ్లేషణ:
ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ జ‌గ‌ప‌తిబాబు పాత్ర.  ఫ‌ణి భూపాల్‌గా ప్లేబాయ్ పాత్రలో ఆయ‌న చూపిన నటన అంద‌రినీ అల‌రించ‌డ‌మే కాక క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. అలాగే  కొడుకు ప్రేమ‌ కోసం తాపత్రయ ప‌డే తండ్రిగా క్లైమాక్స్‌లో ఆయ‌న ప‌లికించిన భావోద్వేగాలు అంద‌రినీ క‌ట్టిప‌డేస్తాయి. అయితే క‌థ బోల్డ్ కంటెంట్‌తో నిండిన‌ది కావ‌డం.. దీనికి త‌గ్గట్లుగా క‌థ‌లో వినిపించే డబుల్ మీనింగ్ డైలాగులు  కుటుంబ ప్రేక్షకుల‌కు అంత‌గా నచ్చక‌పోవ‌చ్చు. అయితే దర్శకుడు క‌థ‌ని తెర‌పై  చక్కగా చూపించే ప్రయ‌త్నం చేసినా.. క‌థ‌లో స‌రైన బ‌లం లేక‌పోవ‌డం సినిమాకు పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. ఇక కార్తీక్ త‌న పాత్రకు న్యాయం చేశాడు. ఉమాతో లవ్ సీన్స్.. క్లైమాక్స్‌లో వ‌చ్చే ఎమోషనల్ సీన్స్ లో అత‌ని న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఉమాగా అమ్ము అభిరామి చక్కగా నటించింది. సాంకేతిక ప‌రంగా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

ప్లస్ పాయింట్స్ :  ఫస్టాఫ్, క్లైమాక్స్, జగపతిబాబు నటన | మైనస్‌ పాయింట్స్‌ : సాగదీత సీన్లు, బలహీనమైన కథ  రేటింగ్: 1.5/5

అత్యంత ప్రముఖమైనవి

సుకుమార్ కూతురి వేడుక‌లో ఎన్టీఆర్, మహేష్, చై ఫ్యామిలీస్ సందడి.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురి ఫంక్షన్‌లో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్యా నమ్రతతో కలిసి సందడి చేయగా.. నాగచైతన్య,...

కృతి శెట్టికి క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ‘ఉప్పెన’ బ్యూటీ

'ఉప్పెన' సినిమాలో హీరోయిన్‌గా నటించిన యువ నటి కృతి శెట్టి ఎలాంటి నటన కనబర్చిందనేది అందరికీ తెలుసు. రొమాంటిక్ సీన్స్, సెంటిమెంటల్ సీన్స్ ఇలా అన్ని కోణాల్లో ఆమె చూపించిన...

‘ఆచార్య’ సెట్స్ లో సందడి చేసిన చిరు, చరణ్.. వైరల్‌ ఫోటోలు

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక మే 13న ప్రపంచ...

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఇటీవలి వ్యాఖ్యలు