Home సినిమాలు 'చెక్' ప్రీ రిలీజ్ బిజినెస్.. నితిన్ చించేస్తున్నాడు బాబోయ్..!

‘చెక్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. నితిన్ చించేస్తున్నాడు బాబోయ్..!

స్టార్‌ కథానాయకుడు నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరో హీరోయిన్లుగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్‌’. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతీది సినిమాపై క్రేజ్‌ను పెంచుతూ వచ్చాయి. నితిన్‌ ఈ తరహా పాత్రని ఇప్పటి వరకు చేయకపోవడంతో పాటు, ఇటీవల విడుదలైన ట్రైలర్‌ కూడా సినిమా వైవిధ్యంగా తెరకెక్కినట్లుగా హింట్‌ ఇవ్వడంతో.. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని నితిన్‌ అభిమానులు ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో దుమ్మురేపినట్లు తెలుస్తోంది. ‘చెక్’ సినిమా థియేట్రికల్ హక్కులు మంచి ధరలకు అమ్ముడుపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు ‘చెక్’ సినిమాకు రూ.15 కోట్లు వెచ్చించారని సమాచారం. నైజాం రైట్స్‌ను వరంగల్ శ్రీను రూ.5 కోట్లకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ రూ.15 కోట్లతో పాటు శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా నిర్మాతకు మరో రూ.12 కోట్లు లభించిందట. కాబట్టి, ఈ సినిమా నిర్మాత ప్రస్తుతానికి సేఫ్ జోఫ్ లో ఉన్నాడు.అయితే  ఈ సినిమాను విడుదల చేస్తోన్న డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటో ఈనెల 26 తరవాత తెలుస్తుంది. కాగా, ఈ చిత్రంలో సాయి చంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, హర్షవర్ధన్, రోహిత్, సిమ్రాన్ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు