Home సినిమాలు నవ్వులు పూయిస్తున్న ‘జాతి రత్నాలు’ టీజర్

నవ్వులు పూయిస్తున్న ‘జాతి రత్నాలు’ టీజర్

న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియ‌ద‌ర్శి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జాతిర‌త్నాలు’. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనుదీప్ కె.వి. దర్శకత్వం వహిస్తున్నాడు. స్వప్న సినిమా బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించారు.మార్చి 11వ తేదీన ‘జాతి రత్నాలు’ ప్రేక్షకుల ముందుకు కానుంది. సంగీతం రాధన్‌ అందిస్తున్నాడు. ఈ సినిమాలో వీకే నరేశ్‌, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా,గురువారం సాయంత్రం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. థియేట‌ర్లలో ఈ సినిమా న‌వ్వుల పువ్వులు పూయిస్తుంద‌ని టీజ‌ర్ చూస్తే అర్ధమవుతుంది. ముగ్గురు ప్రధాన పాత్రధారులు న‌వీన్‌, రాహుల్ రామ‌కృష్ణ, ప్రియ‌ద‌ర్శి జైలులో ఖైదీలుగా న‌డ‌చుకుంటూ రావ‌డంతో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. జైల్లో ఉంటూ కామెడీ చేస్తున్నారు ఈ ఖైదీలు. సెల్‌లో నుంచి ప్రియ‌ద‌ర్శి త‌న‌వైపు ముగ్గురు ఉన్నార‌ని.. వారు త‌మ‌న్నా, స‌మంత అని చెప్పి, మూడో పేరు కోసం త‌డుముకుంటుంటే ర‌ష్మిక అని అందిస్తాడు న‌వీన్‌. అయితే, ఇలాంటి కామెడీ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఈ సినిమాలో చాలా ఉన్నాయని తెలుస్తోంది.. ముర‌ళీ శ‌ర్మ రూ.500 కోట్ల ప్రాజెక్టు చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని అర్థమ‌వుతుంది.

అత్యంత ప్రముఖమైనవి

ప్రభాస్@రూ.100 కోట్లు.. భారతీయ చిత్ర సీమలో సంచలనం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రొమాంటిక్, లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా సినిమాలతో అగ్రహీరోగా...

ప‌వన్‌-క్రిష్ సినిమా నుండి పవర్ స్టార్ లుక్ లీక్.. వైర‌ల్ అవుతున్న ఫోటో

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌- సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో రూపొందనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచ‌నాలు...

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

ఇటీవలి వ్యాఖ్యలు