‘ఉప్పెన’ ఫస్ట్ డే కలెక్షన్స్..
మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. చిత్ర హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఇది మొదటి సినిమా. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 12న థియేటర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్‌కు ఇది తొలి సినిమానే అయినా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం అద్భుతంగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్‌ను రూ.20.50 కోట్లకు అమ్ముడవగా.. నైజాం థియేట్రికల్ రైట్స్‌ను రూ.6 కోట్లకు.. ఆంధ్ర థియేట్రికల్ రైట్స్‌ను రూ.10 కోట్లకు, సీడెడ్ రూ.3 కోట్లకు విక్రయించారు. ఓవర్సీస్, మిగిలిన ప్రాంతాలు కలుపుకుని రూ.1.5 కోట్లు కాగా.. మొత్తంగా ‘ఉప్పెన’ థియేట్రికల్ రైట్స్ రూ.20.5 కోట్లకు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటడానికి సుమారు రూ.22 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంది.
అయితే ‘ఉప్పెన’ సినిమాకి మంచి హైప్ ఉండటంతో పాటు.. తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించినట్లు తెలుస్తోంది. అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలిరోజు ఉప్పెన చిత్రానికి రూ.7 కోట్ల భారీ ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వీకెండ్స్ రావడంతో ప్రేక్షకులు ఉప్పెన చిత్రానికి క్యూ కట్టే అవకాశం ఉంది. పైగా మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలు ఉప్పెన చిత్రంలో చాలానే ఉండటంతో కలెక్షన్లు జోరందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.