ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోలందరు వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ రామ్‌చరణ్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ తప్ప మరే ప్రాజెక్ట్ ప్రకటించలేదు. చిరంజీవి ‘ఆచార్య సినిమాలో చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అయితే, రామ్‌చరణ్ నెక్ట్స్ సినిమా పై ఎప్పటి నుంచో సందిగ్ధత నెలకొని ఉంది. పలువురు దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా కమిటయ్యారు. దీనికి సంబంధించి శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. చరణ్-శంకర్ కాంబో ఫిక్స్ అని పేర్కొంటూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది.
ఈ సినిమా పవర్ఫుల్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్గా సాగే ఈ సినిమాలో రామ్ చరణ్‌తోపాటు రాక్ స్టార్ యశ్ కూడా నటించనున్నట్లు సమాచారం. మరోవైపు, రామ్‌చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13న ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల విడుదల కానుంది. ఇక, శంకర్-కమల్‌హాసన్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘భారతీయుడు-2’ చిత్రీకరణ లాక్డౌన్ తర్వాత ఇంకా ప్రారంభం కాలేదు. ఇది పూర్తయిన తర్వాత రామ్ చరణ్ సినిమా పట్టాలెక్కనున్నట్లు సమాచారం.