Home సినిమాలు 'రాధేశ్యామ్' క్రేజీ అప్‌డేట్.. వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇదే!

‘రాధేశ్యామ్’ క్రేజీ అప్‌డేట్.. వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇదే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ మరోసారి ప్రేమికుడి పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. కాగా,ఈ సినిమా టీజర్‌ కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ విడుదల చేయనున్నామని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ‘రాధేశ్యామ్‌’ టీజర్‌కు సంబంధించిన ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ను శుక్రవారం అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు ఆదివారం ఉదయం 9.18 గంటలకు ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్‌’ పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి దక్షిణాదిలోని అన్ని భాషల్లో జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు సమకూర్చనుండగా. హిందీ వెర్షన్‌కు మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీతం అందించనున్నారు. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. అలనాటి నటి భాగ్యశ్రీ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈ మూవీపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

కీర్తి సురేష్ – గుడ్ లక్ సఖి

క్రీడా నేపధ్యం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం "గుడ్ లక్ సఖి"  ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకుడు.  సుధీర్ చంద్ర నిర్మాత.  షూటింగ్ క్రీడ...

నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు....

ఇటీవలి వ్యాఖ్యలు