Home సినిమాలు సిల్క్‌ స్మిత బయోపిక్‌లో శ్రీరెడ్డి..ఇక రచ్చ రచ్చే!

సిల్క్‌ స్మిత బయోపిక్‌లో శ్రీరెడ్డి..ఇక రచ్చ రచ్చే!

వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన కొత్త సినిమాను తాజాగా ప్రకటించారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ప్రకటన. ఎందుకంటే, ఈ సినిమా దివంగత నటి సిల్క్ స్మిత బయోపిక్. టైటిల్ రోల్‌ను శ్రీరెడ్డి పోషించబోతున్నారు. తాను సిల్క్ స్మిత బయోపిక్‌లో నటించబోతున్నట్టు తెలియజేస్తూ ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు శ్రీరెడ్డి. అంతేకాదు, ఇదే వీడియోలో దర్శకుడు మధును కూడా పరిచయం చేశారు.  దిగ్గజ నటి సిల్క్‌ స్మిత బయోపిక్‌ చేస్తున్నానని, మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. మధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని శ్రీరెడ్డి తెలిపింది.

కాగా,శ్రీరెడ్డి ఇప్పటికే కొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆ మధ్య ‘క్లైమాక్స్’ అనే సినిమాలో శ్రీరెడ్డి కనిపించింది. తరవాత మళ్లీ మరో సినిమాలో నటించిన దాఖలాలు లేవు. అయితే,ఇప్పటికే సిల్క్‌ స్మిత జీవితకథ ఆధారంగా పలు భాషల్లో బయోపిక్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో 2011లో డర్టీ పిక్చర్‌ పేరుతో విడుదలైన సిల్క్‌ స్మిత బయోపిక్‌లో నటి విద్యాబాలన్‌ నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గానూ జాతీయ అవార్డును కైవసం చేసుకుంది.

అత్యంత ప్రముఖమైనవి

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

గింగిరాల పిచ్ పై భారత్ వికెట్ల తేడాతో విజయం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ స్టేడియం లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవది మరియు...

ఇటీవలి వ్యాఖ్యలు