అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా అల్లు అరవింద్ సమర్పణలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. బన్నీ వాసు, దర్శకుడు వాసు వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.ఆమని, మురళీ శర్మ, జయప్రకాష్, ప్రగతి, ‘సుడిగాలి’ సుధీర్, ‘గెటప్’ శ్రీను, అభయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ-టీజర్ నెటిజన్లను అకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం.
కాగా, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’ సినిమా ప్రమోషన్ ను చిత్రయూనిట్ వేగవంతం చేశారు. ఈ క్రమంలోన్ ప్రేమికుల రోజు కానుకగా మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరపరిచిన రొమాంటిక్ సాంగ్ ‘గుచ్చే గులాబీలాగా పాటను’ తాజాగా విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్, శ్రీమణి లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ పాట సంగీత ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఈ పాట విని ఎంజాయ్ చేయండి.