Home సినిమాలు త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్...ఎన్టీఆర్ సినిమాపై క్రేజీ అప్‌డేట్..!

త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్…ఎన్టీఆర్ సినిమాపై క్రేజీ అప్‌డేట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ మూవీ రానున్న సంగతి తెలిసిందే. గతేడాది ఆరంభంలోనే ‘అల వైకుంఠపురంలో’ విజయం తన ఖాతాలో వేసుకొని మంచి ఊపులో ఉన్న త్రివిక్రమ్.. ఈ ఏడాది ఎన్టీఆర్‌తో మరో భారీ సినిమా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ తో పాటు ‘చౌడప్ప నాయుడు’ అనే మరో టైటిల్ కూడా వినిపిస్తుంది. 

తాజాగా ఈ సినిమా గురించి మరో అప్ డేట్ బయటికి వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ స్నేహితుడి పాత్ర ఒకటి ఉందని.. దానికోసం టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టిని తీసుకుంటున్నారని సమాచారం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్. ప్రస్తుతం జాతిరత్నాలు సినిమాతో రానున్నాడు. అలాగే ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కూడా విలన్ పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సునీల్ ప్రతినాయకుడిగా నటించనున్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

రాజకీయ నేపథ్యం ఉన్న ఈ చిత్రంలో పొలిటికల్ లీడర్ గా నటించబోతున్నాడు ఎన్టీఆర్. కాగా,హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. ఏదేమైనా షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనడం గమనార్హం.

అత్యంత ప్రముఖమైనవి

మొగలి రేకులు సీరియల్ “సాగర్ ఆర్ కే నాయుడు హీరో గా “షాదీ ముబారక్” ట్రైలర్ విడుదల

షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ ఈ రోజు లాంచ్ చేశారు.  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి పద్మశ్రీ దర్శకుడు.  రొమాంటిక్ కామెడీ గా ఈ చిత్రాన్ని మలిచారు. ...

“ఉప్పెన” మేకింగ్ వీడియో

వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంట గా వచ్చిన సూపర్ హిట్ మూవీ "ఉప్పెన" మేకింగ్ వీడియో ని మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేశారు.  ఈ చిత్రాన్ని...

గింగిరాల పిచ్ పై భారత్ వికెట్ల తేడాతో విజయం

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ స్టేడియం లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవది మరియు...

ఇటీవలి వ్యాఖ్యలు