‘నిన్ను కోరి’ ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ రొమాంటిక్ ఎంటర్టైనర్లు తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడు. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ఆకట్టుకున్నాయి. వాలంటైన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ మరో బహుమతి అందించింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘ఇంకోసారి.. ఇంకోసారి..’ లిరికల్ వీడియోను రిలీజ్ చేసింది. తమన్ స్వరపరిచిన ఈ మ్యాజికల్ మెలోడీని ఈ “ఇంకోసారి ఇంకోసారి” అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాని, రీతు వర్మ జంటపై చిత్రీకరించిన ఈ సాంగ్ సంగీత ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
కాగా, ‘టక్ జగదీశ్’ సినిమాని వేసవి కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్టు ఇతివాల చిత్రబృందం ప్రకటించింది. ఇందులో జగదీష్ నాయుడు అనే పాత్రలో కనిపించి సందడి చేయనున్నాడు నాని. టక్ జగదీష్ చిత్రం మంచి ఎమోషన్స్‌తో కూడిన పూర్తి కుటుంబ నాటక చిత్రంగా రూపొందుతుందని సమాచారం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్, రావురమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.