టాలీవుడ్ లోకి ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది..మెహ్రీన్ మాజీ ముఖ్యమంత్రి మనువడిని వివహమాడనుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే మెహ్రీన్ కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. హర్యానా సీఎంగా భజన్ లాల్ బిష్ణోయ్ మూడు సార్లు పనిచేశారు. కాగా, అతడి మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడే భవ్య బిష్ణోయ్. అయితే పెద్దలు వీరి పెళ్లికి అంగీకారం తెలపడంతో మెహ్రీన్, భవ్య వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
కాగా వీరి నిశ్చితార్థం మార్చి 13వ తేదీన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లా ప్యాలస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది కాగా, కృష్ణగాడి వీర ప్రేమకథ, ఎఫ్ 2 సినిమాలతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కవచం సినిమాలో విలన్ పాత్రలోనూ మెప్పించింది. కొన్నాళ్లుగా ఈమె కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఏడాదికి ఒక్క సినిమాలో కూడా అవకాశం దక్కడం లేదు. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్ -3 సినిమాలో మాత్రమే నటిస్తుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు జోడీగా నటిస్తుంది. అయితే వివాహం తర్వాత మెహ్రీన్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.