మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేశ్ పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో ఊపందుకుంది. కీర్తి వివాహానికి సంబంధించి ఇప్పటికే పలు వార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే. తాజాగా కీర్తి పెళ్లిపై మరో గాసిప్ ట్రెండింగ్‌లో ఉంది. తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో కీర్తి ప్రేమలో పడిందని, వీరి పెళ్లికి పెద్దల అంగీకారం కూడా లభించిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇక కీర్తి సురేష్ ప్రేమ, పెళ్లిపై ఇలాంటీ పుకార్లు వైరల్ కావడంతో, అనిరుధ్, కీర్తి సురేష్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వారి నుండి ఈ పెళ్లి ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ వార్తలపై పూర్తి క్లారిటీ రావాలంటే అనిరుధ్ కాని, కీర్తి కాని స్పందించి తీరాల్సిందే.
ఇదిలావుంటే..కీర్తి ప్రస్తుతం తెలుగులో మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ ‘రంగ్ దే’ ‘గుడ్ లక్ సఖి’ సినిమా పనుల్లో బిజీగా ఉంది. అటు దళపతి విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన మాస్టర్ ఫిల్మ్ సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో అనిరుధ్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ప్రస్తుతం తన స్నేహితుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న కమాండర్ 65 చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.