Home సినిమాలు ‘ఉప్పెన’ రెండో రోజు కలెక్షన్లు.. ఆల్‌టైమ్‌ రికార్డు

‘ఉప్పెన’ రెండో రోజు కలెక్షన్లు.. ఆల్‌టైమ్‌ రికార్డు

మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ‘ఉప్పెన’ చిత్రం రెండో రోజు కూడా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు‌ కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తొలిరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం..రెండో రోజు కూడా 5 నుంచి 7 కోట్ల మధ్య షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఇక తొలి రెండు రోజుల్లోనే భారీ స్థాయలో కలెక్షన్లు రాబట్టడంతో వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా  అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పాడు.

కాగా, బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాలేవీ లేకపోవడం.. ‘ఉప్పెన’తో పాటు విడుదలైన జగపతిబాబు FCUK సినిమా టాక్ దారుణంగా ఉండటంతో ఉప్పెనకు వసూళ్ల ఉప్పెన కురుస్తుంది. ముఖ్యంగా యూత్ కు బాగా ఆకట్టుకునే కంటెంట్ కావడం.. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగానే కలిసొచ్చింది. ఏదేమైనా కూడా ఉప్పెన తీరు జోరు చూస్తుంటే డెబ్యూ హీరోల్లో కలెక్షన్స్ పరంగా వైష్ణవ్ తేజ్ కొత్త చరిత్రను రాయడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే వీకెండ్ ముగిసేనాటికి కచ్చితంగా 20 కోట్ల షేర్ అందుకోవడం ఖాయమైపోయింది. ఇదిలావుంటే, లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్‌ సేతుపతి, రాజీవ్‌ కనకాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు