మారుతి దర్శకత్వంలో మ్యాచో హీరో గోపీచంద్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 సంస్థలు నిర్మిస్తున్నాయి. మార్చిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే, గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి వైవిధ్యమైన ప్రచారం చేస్తున్నడైరెక్టర్ మారుతి తాజాగా చిత్ర టైటిల్ అనౌన్స్ చేశారు. “పక్కా కమర్షియల్” అనే టైటిల్‌ని మూవీకి ఫిక్స్ చేసినట్టు పోస్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ సినిమా కూడా కమర్షియల్ హంగులతో కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుందా లేదంటే సీరియస్‌గా సాగుతుందా అనేది తెలియాల్సి ఉంది. అలాగే, ఈ సినిమాలో నటించే నటీనటులపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే, అంతకుముందు టైటిల్ ఖరారు చేయకుండానే.. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించేశారు చిత్ర నిర్మాతలు. వరుస పెట్టి సినిమాలు థియేటర్లలోకి వస్తున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడే రిలీజ్ డేట్‌ను లాక్ చేశారు. కాగా, ఈ ఏడాది అక్టోబర్ 1న “పక్కా కమర్షియల్” సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థలు ఇటీవలే అధికారికంగా ప్రకటించాయి. అంతేకాదు, ఆసక్తికర సందేశంతో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో థియేటర్ సీట్లో అక్టోబర్ 1న విడుదల అని ఇంగ్లిష్‌లో రాసి.. కచ్చీఫ్ వేస్తున్నట్టు చూపించారు. యువీ, జీఏ2 వినూత్న ప్రయత్నానికి మంచి స్పందన కూడా లభించింది.