నాగ శౌర్య, రీతూ వర్మ జంట గా నటిస్తున్న చిత్రం “వరుడు కావలెను”. లక్ష్మి సౌజన్య దీనికి దర్శకురాలు. ప్రేమికుల రోజు ని పురస్కరించుకుని ఒక లిరికల్ వీడియో ని విడుదల చేశారు. మంచి ఫామ్ లో ఉన్న సిద్ శ్రీరామ్ ఈ గీతాన్ని ఆలపించారు.
పి డి వి ప్రసాద్ సమర్పిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీత దర్శకులు. మే నెలలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులు జీ తెలుగు ఛానల్ వారు దక్కించుకున్నారని సమాచారం. మనం కూడా ఈ పాట విందాం రండి.