యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం ‘లవ్‌స్టోరి. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా, ఫిబ్రవరి14న ప్రేమికుల రోజున ‘లవ్ స్టోరీ’ చిత్రబృందం ప్రేమికులకు అద్భుతమైన మెలోడి సాంగ్‌ను కానుకగా ఇచ్చింది. ఈ సినిమాలో ‘నీ చిత్రం చూసి..’అంటూ సాగుతున్న సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ గీతానికి సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ స్వరకల్పన చేశారు. మిట్టపల్లి సురేందర్ సాహిత్యానందించారు. ఇప్పటికే ఇందులోని ‘ఏయ్ పిల్లా..’అనే పాట సంగీత ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే తాజాగా విడుదలైన ‘నీ చిత్రం చూసి..’ పాట ప్రేమికుల గుండెల్ని పిండేస్తోంది. మరి ఈ పాటను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.