Home ప్రత్యేకం 'ఇస్మార్ట్ హీరోయిన్‌'కి గుడి కట్టి.. శాస్త్రయుక్తంగా ప్రారంభించిన అభిమానులు

‘ఇస్మార్ట్ హీరోయిన్‌’కి గుడి కట్టి.. శాస్త్రయుక్తంగా ప్రారంభించిన అభిమానులు

చాలామంది రాజకీయ నేతలు, సినిమా ప్రముఖులకు అభిమానులు రకరకాలుగా ఆరాధిస్తుంటారు. తాము అభిమానించే నటీనటుల కోసం కొందరు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మరికొందరైతే… గుళ్లు కట్టి మరి ఆరాధిస్తుంటారు. ఇప్పటికే పలువురు నేతలు, సినీ ప్రముఖులకు ఆలయాలు నిర్మించి ఆరాధిస్తున్న వారి గురించి విన్నాం చదివాం. తాజాగా ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ కి తెలుగు తమిళ అభిమానులు కలిసి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున చెన్నైలో గుడి కట్టారు. అందులో నిధి విగ్రహం ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాదు ఆ గుడిని శాస్త్రయుక్తంగా తాజాగా ప్రారంభించారు.

అలాగే నిధి అగర్వాల్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూజలు చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేయించారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో నిధి ఫ్యాన్స్‌ క్లబ్‌ షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎంత అభిమానం ఉంటే ఇలా విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తారని నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. కాగా, ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాలరాతి శిల్పం నిధి అగర్వాల్. అనతికాలంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఈస్మార్ట్ శంకర్’తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఈ నిధి అగర్వాల్ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అంతేకాకుండా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసిన సంగతి తెలిసిందే.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు