Home ప్రత్యేకం ‘ఉప్పెన’ లా వసూళ్లు..రామ్ చరణ్ రికార్డు బ్రేక్ చేసిన వైష్ణవ్ తేజ్

‘ఉప్పెన’ లా వసూళ్లు..రామ్ చరణ్ రికార్డు బ్రేక్ చేసిన వైష్ణవ్ తేజ్

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా పరిచయం అయిన ‘ఉప్పెన’ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కలలో కూడా ఊహించని విధంగా ఊచకోత కోస్తుంది ఉప్పెన సినిమా. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ప్రభంజనం చూసి నోరెళ్లబెట్టడం తప్ప ఏం చేయలేకపోతున్నారు ట్రేడ్ పండితులు. మూడు రోజుల్లోనే బయ్యర్లు అంతా సేఫ్ జోన్ కు రావడం కాదు లాభాల పంట పండించుకుంటున్నారు. ఏకంగా నాన్ బాహుబలి రికార్డుల వైపు పరుగులు తీస్తుంది ఈ చిత్రం. మరోవైపు తొలి చిత్రంతోనే అత్యధిక షేర్ వసూలు చేసిన డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డ్ సృష్టించాడు.

ఇప్పటి వరకు డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీదే ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన చిరుత చిత్రం అప్పట్లో మంచి విజయమే సాధించింది. 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి డెబ్యూ హీరోగా చరిత్ర సృష్టించాడు రామ్ చరణ్. 2007లోనే అంత మొత్తం వసూలు చేసాడు ఈయన. ఆ తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు ఎవరూ సాధించలేకపోయారు. చాలా మంది వారసులు పరిచయమైనా కూడా వాళ్లకు చిరుత రేంజ్ రాలేదు. మెగా కుటుంబం నుంచే చరణ్ తర్వాత వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శిరీష్ లాంటి హీరోలు వచ్చారు కానీ పని జరగలేదు. 

అయితే, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శీనుతో 20 కోట్ల షేర్ అందుకున్నాడు కానీ చిరుతను మాత్రం క్రాస్ చేయలేకపోయాడు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ చిరుత రికార్డులను బద్దలు కొట్టాడు. ఉప్పెన చిత్రంబుమూడు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్.. 28 కోట్ల షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.

అత్యంత ప్రముఖమైనవి

వెండితెరపైకి గాన గంధర్వుడు ‘ఎస్పీ బాల సుబ్రమణ్యం’ బయోపిక్‌

గాన గంధర్వుడు, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న మరణించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సోకడంతో అనారోగ్య సమస్యలకు గురైన ఆయన చెన్నైలోని...

పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిన ‘ఫిదా’ బ్యూటీ సాయిపల్లవి!

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జెట్ స్పీడుతో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే తన 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్...

ప్రపంచ ధనవంతుల జాబితా ఇదే.. 6.09 లక్షల కోట్ల సంపదతో 8వ స్థానంలో ముఖేశ్ అంబానీ

భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. హురున్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎల్) అధినేత రూ. 6.09 లక్షల కోట్ల...

ఏప్రిల్ 14న ‘సలార్’ విడుదల చేయడం వెనకున్న అసలు కారణం ఇదేనా.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమాలు ఒకొక్కటిగా విడుదల తేదీల్ని ఖరారు చేసుకుంటున్నాయి. ఆయన హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆది పురుష్‌’ చిత్రాల విడుదల ఎప్పుడనేది ఇప్పటికే తేలిపోయింది. తాజాగా...

ఇటీవలి వ్యాఖ్యలు