Home సినిమాలు ఎక్స్‌క్లూజివ్: బాలయ్య, బోయపాటి బీబీ3 చిత్రానికి టైటిల్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కి పండగే!

ఎక్స్‌క్లూజివ్: బాలయ్య, బోయపాటి బీబీ3 చిత్రానికి టైటిల్ ఫిక్స్.. ఫ్యాన్స్‌కి పండగే!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు ఏ రేంజ్‌లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, రీసెంట్‌గా ఈ సినిమాకు రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు. విశ్వ విఖ్యాత న‌ట‌సార్వభౌమ, న‌ట‌ర‌త్న శ్రీ నందమూరి తారక రామారావు జయంతి రోజైన మే 28న బీబీ3 చిత్రాన్ని విడుదల చేయాలని బాలయ్య సంకల్పించారు. 

ఇదిలావుంటే..తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్‌నే ఫైనల్ చేశారని, ఈ టైటిల్‌ను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రకటించనున్నారని సమాచారం. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘బీబీ3 ఫస్ట్ రోర్’ నందమూరి అభిమానులను హుషారెత్తించింది. బోయపాటి మార్క్ చూపిస్తూ బాలయ్య చేత చెప్పించిన ఊరమాస్ డైలాగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యంగ్ ప్రొడ్యూస‌ర్‌ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజిక్‌ మిస్సైల్‌ ఎస్‌.ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

భారీగా కరిగిన ఎల‌న్ మస్క్‌ సంపద.. కారణం ఇదే!

ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌.. గడిచిన వారం రోజుల్లో భారీగా నష్టపోయారు. సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన...

శర్వానంద్ కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్‌ చిరంజీవి..

శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు....

అరణ్య మూవీ నుంచి అరణ్య గీతం

ప్రభు సాల్మన్ దర్శకత్వం లో దగ్గుబాటి రానా కీలక పాత్రలో వస్తున్న చిత్రం అరణ్య.  ఈ చిత్రం లో ఒక పాటని అరణ్య గీతం పేరుతో ఈ చిత్ర బృందం...

సమంత ‘శాకుంతలం’లో దుష్యంతుడు ఎవరంటే.. గుణశేఖర్ స్కెచ్ మామూలుగా లేదు!

గతంలో తెలుగుచిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన భారీ సెట్ల దర్శకుడు గుణశేఖర్‌కి ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. వరుస ఫ్లాపుల కారణంగా అగ్రహీరోలు ఆయన్ని పక్కన పెట్టేయగా.. యంగ్ హీరోలు కూడా...

ఇటీవలి వ్యాఖ్యలు