Home ప్రత్యేకం చిరంజీవి’ రికార్డు బద్దలు కొట్టిన 'వైష్ణవ్ తేజ్'.. చరిత్ర సృష్టించిన ‘ఉప్పెన’

చిరంజీవి’ రికార్డు బద్దలు కొట్టిన ‘వైష్ణవ్ తేజ్’.. చరిత్ర సృష్టించిన ‘ఉప్పెన’

మెగాస్టార్‌ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఫిబ్రవరి 12 విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకొని సక్సెస్ టాక్‌తో ముందుకెళుతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. 

కాగా, ‘ఉప్పెన’ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసింది. తొలి మూడు రోజుల కలెక్షన్లలో ‘ఉప్పెన’ సినిమా..చిరంజీవి హీరోగా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ని కూడా క్రాస్ చేసేసిందని వార్తలు వస్తున్నాయి. తొలి మూడు రోజుల కలెక్షన్ల విషయంలో మహేశ్ బాబూ ‘మహర్షి’ ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ కూడా ‘ఉప్పెన’ వెనకే ఉన్నాయట. అలాగే తొలి సినిమాతోనే రికార్డు కలెక్షన్లు సాధించిన హీరోగా వైష్ణవ్ నిలిచాడు. కాగా, ఈ రోజు `ఉప్పెన` దర్శకుడు బుచ్చిబాబు జన్మదినోత్సవం. ఈ సందర్భంగా `ఉప్పెన` నిర్మాణ సంస్థ రూ.50 కోట్ల పోస్టర్‌ను విడుదల చేసింది.

అత్యంత ప్రముఖమైనవి

రాణించిన హిట్ మాన్ రోహిత్ శర్మ. భారత్ 99/3

గులాబీ బంతితో విజృంభించిన భారత స్పిన్నర్లు….కుప్పకూలిన ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం - అహ్మదాబాద్ లో సరికొత్తగా రూపు దిద్దుకున్న నరేంద్ర మోడీ...

ఈ శుక్రవారం 9 సినిమాలు విడుదల.. కానీ అందరి చూపు ఆ సినిమాపైనే..!

శుక్రవారం వచ్చిందంటే.. కొత్త సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. బొమ్మ ఎలా ఉన్నా ప్రేక్షకులు థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభన తగ్గడంతో తెలుగు ఇండస్ట్రీలో మెల్లగా మునపటి పరిస్థితులు...

ప్రభాస్ కి పోటీగా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న...

ఆకట్టుకున్న “ముంబై సాగా” టీజర్

భారీ తారాగణంతో టి-సిరీస్ పతాకం పై, సంజయ్ గుప్తా దర్శకత్వంలో తయారవుతోన్న బాలీవుడ్ చిత్రం “ముంబై సాగా”.  జాన్ అబ్రహం, సునీల్ శెట్టి, ఇమ్రాన్ హష్మీ, కాజల్ అగర్వాల్, మహేష్...

ఇటీవలి వ్యాఖ్యలు