ఉప్పెన చిత్రానికి కలెక్షన్లు వరదల్లా వస్తున్నాయి. తొలి చిత్రంతోనే బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. తొలిరోజు రూ.10. 42 కోట్ల షేర్ రాబట్టి.. డెబ్యూ చిత్రంతో అత్యధిక వసూల్లు రాబట్టిన హీరోగా రికార్డ్ సృష్టించాడు ఈ మెగా మేనల్లుడు. ఇక మూడో రోజు ఈ ఉప్పెన కలెక్షన్ల వరద రెట్టింపు అయ్యింది. తొలి మూడు రోజుల్లో ‘ఉప్పెన’ ప్రపంచ వ్యాప్తంగా రూ.28.29 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ (రూ. 22.5 కోట్లు)ను దాటేసి లాభాల బాట పట్టింది. ‘ఉప్పెన’. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 24.97 కోట్లు వసూలు చేసి దుమ్మురేపింది. ఇదిలా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు అత్యధిక షేర్ వసూలు చేసిన చిత్రాల్లో ‘ఉప్పెన’ కూడా చేరింది. మూడో రోజు ‘ఉప్పెన’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 8.26 కోట్లు వసూలు చేసింది.
★ మూడు రోజుల్లో ‘ఉప్పెన’ ఎక్కడ ఎంత వసూలు చేసిందనే విషయానికి వస్తే..
◆ నైజాం – రూ. 8.53 కోట్లు◆ ఉత్తరాంధ్ర – రూ. 4.12 కోట్లు◆ సీడెడ్ – రూ. 3.7 కోట్లు◆ తూర్పు గోదావరి – రూ. 2.36 కోట్లు◆ పశ్చిమ గోదావరి – రూ. 1.53 కోట్లు◆ కృష్ణా – రూ. 1.76 కోట్లు◆ గుంటూరు – రూ. 2.07 కోట్లు◆ నెల్లూరు – రూ. 86.4 లక్షలు◆ ఏపీ, తెలంగాణ మొత్తం: రూ. 24.97 కోట్లు◆ ఓవర్సీస్ – రూ. 1.2 కోట్లు◆ కర్ణాటక – రూ. 1.31 కోట్లు◆ రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 33 లక్షలు★ మొత్తం: రూ. 28.29 కోట్లు