Home సినిమాలు మరో ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న రవితేజ.. 'ఖిలాడీ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

మరో ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న రవితేజ.. ‘ఖిలాడీ’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

‘క్రాక్‌’తో విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడీ’తో బిజీగా గడుపుతున్నారు. రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి కథానాయికలు. సత్యనారాయణ కోనేరు నిర్మాత. జయంతీలాల్‌ గడ సమర్పిస్తున్నారు. ఓ వైవిధ్యభరిత యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. రవితేజ రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వేసవి కానుకగా మే 28న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

అయితే, భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే పలు అప్ డేట్స్ వచ్చేశాయి. కాగా, శివరాత్రి సందర్బంగా మరో స్పెషల్ సర్ప్రైజ్ ను రవితేజ అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారట చిత్రబృందం. తాజా సమాచారం ప్రకారం శివరాత్రి పర్వదినాన ‘ఖిలాడీ’ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారట. చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే టీజర్ కు సంబంధించిన షాట్స్ ను కట్ చేయడంతో పాటు ఒక పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ట్యూన్ చేయిస్తున్నారని సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే ఖిలాడీ టీజర్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

ఇక ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్.. స్టార్ నటుడు ఉన్ని ముకుందన్.. జబర్దస్త్ యాంకర్ అనసూయలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కాగా, రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్  భారీ స్పందన తెచ్చుకోవడంతో పాటు సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాయి.

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు