ఉప్పెన చిత్రానికి కలెక్షన్లు కూడా ఉప్పెనలాగే వస్తున్నాయి. తొలి చిత్రంతోనే బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఐదో రోజు కూడా ఈ చిత్రం సంచలన వసూళ్లు సాధించింది. సాధారణంగా వీకెండ్ అయిపోయిన తర్వాత వీక్ డేస్ మొదలైతే కలెక్షన్స్ లో కాస్త డ్రాప్ ఉంటుంది. కానీ ఉప్పెన విషయంలో మాత్రం అలాంటిది కనిపించడం లేదు. ఫిబ్రవరి 12న విడుదలైన ‘ఉప్పెన’ తొలిరోజే రూ. 10.42 కోట్ల షేర్ రాబట్టగా..ప్రస్తుతం 50కోట్ల క్లబ్ వైపు దూసుకెళుతోంది. మూడో రోజుకు 28కోట్ల షేర్ సాధించి నాలుగో రోజుకు 34కోట్ల షేర్ కు చేరువైంది. నాలుగు రోజులకు 33.64 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. అయితే,ఐదు రోజులకు గాను ‘ఉప్పెన’ సుమారు 38 కోట్ల వసూళ్లు సాధించింది.
కాగా,తాజాగా ఐదో రోజు వివరాలు వెల్లడయ్యాయి. ఉప్పెన ఐదో రోజు వసూళ్లను పరిశీలిస్తే 3.92 కోట్ల షేర్ వసూలైంది. నైజాం-1.15 కోట్లు.. సీడెడ్ – 65 లక్షలు.. వైజాగ్ (ఉత్తరాంద్ర) -59 లక్షలు.. తూ.గో జిల్లా -39 లక్షలు.. ప.గో జిల్లా- 18లక్షలు..కృష్ణ-19లక్షలు.. గుంటూరు 24లక్షలు.. నెల్లూరు13 లక్షలు వసూలైంది. ఇక ఏపీ-తెలంగాణ కలుపుకుని 3.52 కోట్లు ఇతరములు కలుపుకుని 3.92 కోట్లు మొత్తంగా వసూలైంది.
అలాగే 40లక్షలు వెలుపలి నుంచి కలెక్ట్ అయ్యింది. కర్నాటక 15లక్షలు.. చెన్నై 7 లక్షలు..ఓవర్సీస్ 10లక్షలు.. ఇతర భారతదేశం 8లక్షలు.. వసూలైంది. వాస్తవానికి, ‘ఉప్పెన’ తొలి మూడు రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. ఈ మొత్తాన్ని మూడు రోజుల్లోనే రాబట్టేసింది.