సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే ‘సర్కారు వారి పాట’. మహేశ్‌తో ‘మహానటి’ కీర్తి సురేశ్ తొలిసారిగా జోడీ కడుతున్నారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సక్సెస్‌ల తర్వాత మహేశ్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం కావడంతో సరిలేరు మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. 14 రీల్స్ ప్లస్, మహేశ్‌బాబు సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
అయితే, ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ దుబాయ్‌లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంటుంది. ఈ షెడ్యూల్లో మహేశ్, కీర్తిసురేష్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫిబ్రవరి 21నాటికి దుబాయ్ షెడ్యూల్ పూర్తవుతుందట. అక్కడి నుంచి యూనిట్, హైదరాబాద్ రీచ్ అవుతుంది. అయితే ఫిబ్రవరి 21న సెకండ్ షెడ్యూల్ కూడా ముగుస్తుంది కాబట్టి ఆ రోజు ఫ్యాన్స్‌ను అలరించేందుకు చిన్న వీడియోను విడుదల చేయాలని సర్కారు వారి పాట చిత్ర బృందం భావిస్తుంది. ఇందులో దుబాయ్ లోని అద్భుతమైన లొకేషన్స్‌ను చూపించనున్నారని సమాచారం. మహేశ్ 27వ చిత్రం `సర్కారువారి పాట`మూవీని మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మితమవుతుంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుంది.