ఎన్టీఆర్-రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఓ స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది. రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘‘బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను మేం దక్కించుకున్నామని ప్రకటించడం ఎంతో సంతోషంగా గర్వంగా ఉంది’’ అని లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్ లో పేర్కొంది.
అయితే, ఈ థియేట్రికల్ రైట్స్‌ను లైకా ప్రొడక్షన్స్ రూ.45 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై లైకా ప్రొడక్షన్స్ అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజానికి తమిళనాడులో రాజమౌళి సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందువల్లే తమిళ థ్రియాట్రికల్ రైట్స్ కు లైకా ప్రొడక్షన్స్ ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించినట్టు తెలుస్తోంది. గతంలో బాహుబలి 2 తమిళ రైట్స్ కు రూ.37 కోట్లు పలికాయి. దీంతో పోలిస్తే మార్కెట్ లో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం ఓ రేంజ్లో ఉంటుందనిపిస్తోంది.
కాగా, భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించనున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ నటించారు. అజయ్‌దేవ్‌గణ్ కీలక పాత్రలో అలరించనున్నారు. దాదాపు రూ.400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. 2021 అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది.Attachments area