Home ప్రత్యేకం చరిత్రను తిరగరాసిన 'ఉప్పెన'.. వైష్ణవ్ తేజ్ దెబ్బకు 21 ఏళ్ల రికార్డు బద్దలు!

చరిత్రను తిరగరాసిన ‘ఉప్పెన’.. వైష్ణవ్ తేజ్ దెబ్బకు 21 ఏళ్ల రికార్డు బద్దలు!

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వచ్చిన “ఉప్పెన” చిత్రం బాక్సాఫీస్‌ మీద దాడి చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి రోజే రికార్డు స్టాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ రాబట్టింది. అదే రికార్డు స్థాయిలో ఐదోరోజు కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. కాగా, ‘ఉప్పెన’ తాజాగా ఆల్ ఇండియా రికార్డ్‌ను కూడా బద్దలుకొట్టింది. భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును వైష్ణవ్ తేజ్ బ్రేక్ చేశాడు.

కాగా, భారత సినీచరిత్రలో ఒక డెబ్యూ హీరోకి హయ్యస్ట్ గ్రాసర్‌గా ‘ఉప్పెన’ చిత్రం నిలిచింది. ఈ రికార్డు అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తొలి చిత్రం సినిమా ‘కహో నా ప్యార్ హై’ పేరిట ఉంది. ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ.41 కోట్లు (నెట్) వసూలు చేసింది. అయితే, ‘ఉప్పెన’ ఐదు రోజుల్లోనే రూ.42 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి ‘కహో నా ప్యార్ హై’ రికార్డును తిరగరాసింది. దీంతో రాబోయే కొత్త హీరోలకు వైష్ణవ్ తేజ్ చాలా పెద్ద టార్గెట్ ఫిక్స్ చేసినట్టయింది. ఇదిలా ఉంటే, ‘ఉప్పెన’ ఐదో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.92 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో ఐదు రోజుల్లో ‘ఉప్పెన’ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన షేర్ మొత్తం రూ. 37.39 కోట్లకు చేరుకుంది.

అత్యంత ప్రముఖమైనవి

సస్పెన్స్ థ్రిల్లర్ “A” సినిమా ట్రైలర్

నితిన్ ప్రసన్న, ప్రీతీ అస్రా ని లు నటిస్తున్న థ్రిల్లర్ “A”.  అవంతికా ప్రొడక్షన్స్ పతాకం పై గీత మిన్ సల నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు యుగంధర్ ముని...

కీర్తి సురేష్ – గుడ్ లక్ సఖి

క్రీడా నేపధ్యం లో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం "గుడ్ లక్ సఖి"  ఈ చిత్రానికి నగేష్ కుకునూర్ దర్శకుడు.  సుధీర్ చంద్ర నిర్మాత.  షూటింగ్ క్రీడ...

నితిన్ కోసం రంగంలోకి దిగిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబు

యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు....

ఇటీవలి వ్యాఖ్యలు