సినీ పరిశ్రమలో ఇతర విభాగాల్లో మంచి పేరు తెచ్చుకున్న పలువురు ప్రముఖులు నిర్మాతలుగా మారి హిట్లు కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు వారిలానే టాలీవుడ్ స్టార్ హీరో ప్రొడ్యూసర్ గా మారుతున్నారు. ఆయనే మాస్ మహారాజ రవితేజ..అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ, స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. మాస్ పాత్రలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ఈ మధ్యే క్రాక్‌తో భారీ హిట్ అందుకున్న రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
అయితే, తాజాగా రవితేజ నిర్మాతగా మారినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కొత్త టాలెంట్‌ను వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించడాని తెలుస్తోంది. అందులో భాగంగా ఆర్టీ వర్క్స్ పేరిట రవితేజ తన బ్యానర్‌ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
కాగా, ఇటీవలే క్రాక్ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రవితేజ అదే జోష్‌లో ఈ ‘ఖిలాడీ’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘రాక్షసుడు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన దర్శకుడు రమేశ్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మాణ బాధత్యలు చేపట్టారు. రవితేజ కెరీర్లో 67వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ భారీ స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయింది.