ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నుమా దాస్, హిట్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన విశ్వక్ సేన్ తాజాగా పాగల్ చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ తాజాగా క్రితం విడుదల చేశారు. ఇందులో విశ్వక్ సేన్ చాలా రొమాంటిక్గాను, ఆవేశంగాను కనిపిస్తున్నాడు. రౌడీలు తల మీద సీసాలు పగలగొడుతుంటే ఎదిరించి వారిని తరిమికొట్టాల్సింది పోయి లవర్ ఫేస్‌లో హ్యాపీనెస్ కనిపించట్లేదు, ఇంకా వైల్డ్‌గా కొట్టండని రెచ్చగొడుతున్నాడు. ఫలితంగా వాళ్లు చితకబాదగా అతడి శరీరం రక్తంతో తడిసిపోయింది. అప్పుడు విశ్వక్ హీరోయిజం చూపిస్తూ వారిని చితక్కొట్టాడు. ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపిస్తున్న విశ్వక్ సేన్ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్‌తో వహ్వా అనిపించాడు.
కాగా, ఈ టీజర్ చూసిన అభిమానులు చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, దిల్ రాజు సమర్పణలో పాగల్ మూవీ రూపొందుతుండగా.. బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రామజోగయ్య శాస్త్రి, కెకె కిట్టు విస్సా ప్రగడ లిరిక్స్ అందిస్తున్నారు. ఏప్రిల్ 30న సినిమా విడుదల కానుంది.