Home సినిమాలు ప్రభాస్ 'రాధే శ్యామ్': ఆసక్తి రేకెత్తిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్!

ప్రభాస్ ‘రాధే శ్యామ్’: ఆసక్తి రేకెత్తిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్!

ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఇందులో కథానాయికగా పూజాహెగ్డే నటిస్తోంది.ఇందులో పూజ పాత్ర పేరు ప్రేరణ. 1970ల నాటి ప్రేమకథా నేపథ్యంలో ఉండనుందని ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇటీవల ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ‘గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్’ లో ప్రభాస్ లుక్‌తో పాటు పురాతన రైల్వే స్టేషన్ సెట్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సెట్‌కి సంబంధించిన కొన్ని వివరాలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే తాజా సమాచారం మేరకు ఈ రైల్వే స్టేషన్, ట్రైన్ సెట్ కోసం భారీ ఖర్చు చేశారట నిర్మాతలు. మూవీ అవుట్‌పుట్ విషయంలో ఏ మాత్రం రాజీపడని నిర్మాతలు.. ఒక్క ట్రైన్ సెట్ కోసమే ఏకంగా 1.6 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. అంతేకాదు ఈ భారీ సెట్ కోసం దాదాపు 250 మంది 30 రోజుల పాటు కష్టపడ్డారట. ఇటలీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇలాంటివి మరెన్నో సెట్‌లను నిర్మించారని సమాచారం.

కాగా, గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ కెరీర్ లో 20వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయబోతున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు