Home ప్రత్యేకం అల్లరి నరేష్ 'నాంది' మూవీ రివ్యూ:

అల్లరి నరేష్ ‘నాంది’ మూవీ రివ్యూ:

నటీనటులు: అల్లరి నరేశ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, ప్రియదర్శి, హరీశ్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌నిర్మాత: సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం: విజయ్‌ కనకమేడలసంగీతం: శ్రీచరణ్‌ పాకాల
కామెడీ హీరోగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే.. అప్పుడప్పుడూ సీరియస్ కథలు, విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు అల్లరి నరేష్. గతంలో ”గమ్యం, ప్రాణం” లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి సత్తా చాటిన ఆయన, ఇప్పుడు ‘నాంది’ అంటూ మరో డిఫరెంట్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 19) ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ నేపథ్యంలో నాంది సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆలరించిందో ఈ సమీక్షలో చూద్దాం…
కథ:
మధ్య తరగతి కుటుంబానికి చెందిన సూర్య‌ప్ర‌కాశ్‌ (అల్ల‌రి న‌రేశ్‌) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. సూర్యకి మీనాక్షి (న‌వమి) అనే అమ్మాయితో పెళ్లి కూడా నిశ్చ‌య‌మ‌వుతుంది.  ఇంత‌లో న్యాయ‌వాది, మాన‌వ హ‌క్కుల కోసం పోరాడే సామాజిక ఉద్య‌మ‌కారుడు రాజ‌గోపాల్ (సి.వి.ఎల్‌.న‌ర‌సింహారావు)ని హ‌త్య చేశాడ‌నే ఆరోప‌ణ‌తో సూర్య‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు.  ఆ హ‌త్య కేసులో ఐదేళ్లు జైల్లోనే ఉంటాడు. ఇంత‌కీ ఆ హ‌త్య‌ని సూర్య‌ప్ర‌కాశే చేశాడా? ఐదేళ్ల త‌ర్వాత అత‌ని జీవితంలో ఏం జ‌రిగింది?  జైలు జీవితం సూర్యని ఎలా ప్రభావితం చేసింది? వంటి వివరాలు తెలియాలంటే ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.
విశ్లేషణ:
భారత పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 211కు సంబంధించిన కథే ‘నాంది’ చిత్రం. తొలి సినిమాతోనే ఓ మంచి సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించిన దర్శకుడు విజయ్ కనకమేడలను కచ్చితంగా అభినందించాల్సిందే. ఆయన స్క్రీన్ ప్లే సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి. క్లిష్టమైన అంశాన్ని సాధారణ ప్రేక్షకుడి అర్థమయ్యేలా తెరపై చూపించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్ తీరు, న్యాయవ్యవస్థలోని అంశాలు, న్యాయాన్ని రాజకీయ నాయకులు ఎలా తప్పు దోవ పట్టిస్తున్నారనే అంశాలను  చక్కగా తెరపై చూపించాడు.ఇక సూర్య‌ప్ర‌కాశ్‌ పాత్ర‌లో జీవించాడు న‌రేశ్‌. ఆయ‌న కామెడీ ఇమేజ్, ఆయ‌న గ‌త చిత్రాల ప్ర‌భావం, ఈ పాత్ర‌పై ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌లేదంటే ఆయ‌న ఆ పాత్ర‌లోఎంత‌గా ఒదిగిపోయాడో అర్థం చేసుకోవ‌చ్చు. అలాగే  వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ఈ సినిమాకి మ‌రో ప్ర‌ధాన బ‌లం. జూనియ‌ర్ లాయ‌ర్ ఆద్య పాత్ర‌లో ఆమె ప్రేక్ష‌కుల మ‌న‌సుల్ని దోచేస్తుంది.  సెకండాఫ్ లో కోర్టులో ఆమె న‌ట‌న అద్భుతంగా ఉంది. ప్రియ‌ద‌ర్శి, ప్ర‌వీణ్ అక్క‌డ‌క్క‌డా నవ్వించారు. హ‌రీశ్‌ ఉత్త‌మ‌న్‌, విన‌య్ వ‌ర్మ విలన్లుగా తమ పరిధి మేరకు రాణించారు. దేవిప్ర‌సాద్‌, శ్రీకాంత్ అయ్యంగార్, హీరోయిన్ న‌వమి త‌దిత‌రులు ఆకట్టుకున్నారు. సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. అన్ని విభాగాలూ చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి
ప్లస్ పాయింట్స్ : నరేశ్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్ నటన, కథ, కథనం
మైనస్‌ పాయింట్స్ : ‌సాగదీత సీన్లు క్లైమాక్స్
రేటింగ్: 3/5

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు