మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏడో రోజు కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫిబ్రవరి 12న విడుదలైన ‘ఉప్పెన’ తొలిరోజే రూ. 10.42 కోట్ల షేర్ రాబట్టింది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వారాంతం వరకూ కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదనిపించింది.
‘ఉప్పెన’ ఏడో రోజు కలెక్షన్స్ (షేర్స్) రిపోర్ట్స్ పరిశీలిస్తే…
★ నైజాం- 38 లక్షలు★ సీడెడ్- 22 లక్షలు★ ఉత్తరాంధ్ర- 34 లక్షలు★ ఈస్ట్ గోదావరి- 17 లక్షలు★ వెస్ట్ గోదావరి – 8 లక్షలు★ గుంటూరు- 9.1 లక్షలు★ కృష్ణా- 9 లక్షలు,★ నెల్లూరు- 11 లక్షలు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లో ‘ఉప్పెన’ ఏడు రోజుల కలెక్షన్స్ మొత్తంగా చూస్తే.. ఆరో రోజు 1.93 కోట్లతో పోల్చితే 20 శాతం రేంజ్ డ్రాప్స్‌తో 7వ రోజు 1.44 కోట్ల షేర్ని ‘ఉప్పెన’ సాదించింది. అయితే ఇప్పటిదాకా కలెక్షన్ల ప్రవాహాన్ని సృష్టించిన ‘ఉప్పెన’ దూకుడుకు ఈ రోజు నుంచి అడ్డుకట్ట పడే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఫిబ్రవరి 19న ఏకంగా నాలుగు సినిమాలు (నాంది, చక్ర, కపటదారి, పొగరు) విడుదలయ్యాయి. నేపథ్యంలో ‘ఉప్పెన’ సినిమాకు పోటీ ఏర్పడిందని అంటున్నారు.