యంగ్ హీరో నితిన్ మంచి దూకుడు మీదున్నాడు. నితిన్ నటించిన ‘చెక్’ మూవీ ఫిబ్రవరి 26న విడుదల కానుండగా.. ‘రంగ్ దే చిత్రం’ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు ఉండగా, వీటికి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలు పెట్టారు నితిన్. ఇదిలా వుంటే నితిన్.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నితిన్ కెరీర్ లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల దుబాయ్‌లో ప్రారంభమైనట్లు సమాచారం
అయితే, బాలీవుడ్ లో బంపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదున్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ కు జోడిగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు చిత్రబృందం. జూన్ 11న సినిమా విడుదల కానుందని తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్లో నితిన్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ మూవీలో తమన్నా భాటియా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.