నేచురల్ స్టార్ నాని తన ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఇవ్వనున్నాడు. ఈనెల 24 న నాని పుట్టినరోజు కావడంతో రాహుల్ సంకృత్యాన్- నాని కాంబినేషన్ లో వస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా తాలూకు తీపి కబురు ని అందించనున్నారట. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో నాని ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్న విషయం కూడా విదితమే దాంతో ఆ సినిమా తాలూకు న్యూస్ ని కూడా అభిమానులకు షేర్ చేయాలని భావిస్తున్నాడట నాని అంటే ఫిబ్రవరి 24 న నాని అభిమానులకు డబుల్ ధమాకా అన్నమాట.
కాగా, ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రాలు ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల ఫస్ట్ లుక్స్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ రూపొందుతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ రూపొందుతోంది. ‘టక్ జగదీష్’ ఏప్రిల్లో విడుదల కానుంది. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రీకరణ కోల్కత్తాలో జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. మొత్తానికి ఈ పుట్టినరోజు నానితో పాటు నాని ఫ్యాన్స్ కు కూడా తీపి జ్ఞాపకమే.