Home సినిమాలు బిగ్ బ్రేకింగ్: బాలయ్య-బోయపాటి సినిమా టైటిల్ ఫిక్స్!

బిగ్ బ్రేకింగ్: బాలయ్య-బోయపాటి సినిమా టైటిల్ ఫిక్స్!

నంద‌మూరి బాల‌కృష్ణ-బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో తెర‌కెక్కు‌తున్న చిత్రం బీబీ3 (వ‌ర్కింగ్ టైటిల్‌). ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. విడుద‌ల తేదీ కూడా ప్ర‌క‌టించింది చిత్ర‌యూనిట్‌. అయితే అభిమానులు మాత్రం టైటిల్ ఏంటో ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇంత‌కీ బాల‌య్య‌-బోయ‌పాటి సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారోన‌ని అంతా అనుకుంటుండ‌గా..బోయపాటి ఇప్ప‌టికే ఓ  టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘గాడ్‌ ఫాదర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య స్టైల్ కు, కథకు ఈ టైటిలే సరిగ్గా సరిపోతుందని చిత్రయూనిట్ నిర్ణయించింది. త్వరలోనే దీనికి అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. అయితే, వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ కావాల్సిఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలలపాటు వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం షూటింగ్ వేగం పెంచేసిన బోయపాటి అతిత్వరలో షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ భారీ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు.

అత్యంత ప్రముఖమైనవి

వైష్ణ‌వ్‌తేజ్‌-కృతిశెట్టికి మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బహుమానం..

మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70...

అల్లు అర్జున్ ‘పుష్ప’లో రష్మిక పాత్ర ఇదే..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో...

శర్వానంద్ “శ్రీకారం” టైటిల్ సాంగ్ విడుదల

త్రివిక్రమ్ విడుదల చేసిన శర్వానంద్ “శ్రీకారం" టైటిల్ సాంగ్.  మిక్కీ జే మేయర్ సంగీతం.  రామ జోగయ్య శాస్త్రి రచన చేసిన పాట ఆకట్టుకున్నది అనే చెప్పాలి.  యువ రైతు...

మహిళ అంటే మాతృత్వం ఒకటే కాదు….అంతకు మించి… ఎమోషనల్ యాడ్ – మహిళా దినోత్సవం స్పెషల్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాన్ కైండ్ ఫార్మా - ప్రేగా న్యూస్ యాడ్ వైరల్ అవుతోంది.  ఇందులో ప్రముఖ నటి మోనా సింగ్ ప్రధాన పాత్రలో నటించారు.  బ్రహ్మ...

ఇటీవలి వ్యాఖ్యలు