Home సినిమాలు భారతీయ సినీ చరిత్రలో 'వైష్ణవ్ తేజ్' సరికొత్త రికార్డ్.. ఎవరికీ అందనంత దూరంలో..

భారతీయ సినీ చరిత్రలో ‘వైష్ణవ్ తేజ్’ సరికొత్త రికార్డ్.. ఎవరికీ అందనంత దూరంలో..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ రంగ ప్రవేశం చేశారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించాడు. ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన ‘ఉప్పెన’ మూవీ తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకొని తొలివారం సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసింది. ఇప్పటికే నిర్మాతలు లాభాల బాటలో పయనిస్తున్నారు.

హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి నటన, విజయ్ సేతుపతి విలనిజం, రియాలిటీకి దగ్గరగా ఉన్న కథ అన్నీ ఈ ‘ఉప్పెన’ కలెక్షన్ల ప్రవాహంలో ముఖ్య పాత్ర పోషించాయి. ఈ క్రమంలోనే కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఒక కొత్త హీరో, హీరోయిన్, డైరెక్టర్ కి ఇదో అరుదైన రికార్డ్. కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. భారత సినీ చరిత్రలోనే ఇంతకు ముందెన్నడూ కొత్తవాళ్ల సినిమా ఈ స్థాయి కలెక్షన్లను వసూలు చేసిన దాఖలాలు లేవు.

వాస్తవానికి ‘ఉప్పెన’ సినిమా తొలి మూడు రోజుల్లోనే  లాభాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.22.5 కోట్లకు అమ్ముడుపోగా.. వారం రోజుల్లో సుమారు రూ.45 కోట్ల షేర్ వసూలు చేసి భారీ హిట్‌గా ‘ఉప్పెన’ నిలిచింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. కాగా, ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేస్తుందని దర్శకుడు బుచ్చిబాబు గురువు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ గతంలో అన్నారు. ఆయన మాటలు నిజం చేస్తూ ‘ఉప్పెన’ రూ.100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది.

అత్యంత ప్రముఖమైనవి

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో సుధీర్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త చిత్రం పేరు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఈ చిత్రం లో ఉప్పెన ఫేం...

ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం”

మొదటి సినిమా దొరసాని తో మంచి పేరు తెచ్చుకున్న అంతగా విజయవంతం కాలేదు.  ఆ తరవాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాన్ని అమెజాన్ లో నేరుగా విడుదల చేసి హిట్ కొట్టాడు...

విజయేంద్ర ప్రసాద్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న “సీత”

రాజమౌళి వరుస విజయాలకు, విజయేంద్ర ప్రసాద్ కధలు కూడా ఒక కారణం.  విజయేంద్ర ప్రసాద్ కధ, స్క్రీన్ప్లే సమకూరుస్తున్న కొత్త చిత్రం "సీత - ది ఇంకార్నేషన్".  ఏ హ్యూమన్...

మూడో వారంలోనూ జోరు చూపిస్తున్న ‘ఉప్పెన’.. కలెక్షన్లు ఎంతంటే..

మెగా కాంపౌండ్ నుంచి ఎందరో హీరోలు సినీ గడపతొక్కారు కానీ అందరిలో ప్రత్యేకం అని నిరూపించుకున్నాడు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'లా వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తొలిసినిమా తోనే తనకంటూ...

ఇటీవలి వ్యాఖ్యలు