Home సినిమాలు విశాల్ 'చక్ర' మూవీ రివ్యూ:

విశాల్ ‘చక్ర’ మూవీ రివ్యూ:

నటీనటులు: విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసండ్రా, కె.ఆర్‌. విజయ, మనోబాల నిర్మాత: విశాల్‌, దర్శకత్వం: ఎం.ఎస్‌.ఆనందన్‌, సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా

ప్రపంచం మొత్తం సాంకేతికత వెంట పరుగులు తీస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో మేం ఎన్నో సాధించాం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఈ గొప్పల వెనుక ఉండే సమస్యలు అనేకం. మనచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మన జీవితాన్ని సైబర్ నేరగాళ్ల చేతికి ఎలా అప్పగిస్తుందన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమే విశాల్ నటించిన ‘చక్ర’.

కథ:
భారత్ దేశంలో 73వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఆ సమయంలో హైద‌రాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో ఒకేసారి 50 ఇళ్లల్లో దొంగతనం జరుగుతుంది. ఇద్ద‌రు ముసుగు వ్య‌క్తులు బైకుల‌పై వ‌చ్చి ఆ దొంగ‌త‌నాలు చేస్తారు. ఆ కేసును చేధించే బాధ్య‌త‌ను ఏసీపీ గాయత్రి(శద్ధా శ్రీనాథ్)కి అప్పగిస్తారు. ఆ దొంగ‌త‌నాలు జరిగిన ఇళ్లల్లో సైనికుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ చంద్ర(విశాల్) ఇళ్లు కూడా ఉంటుంది. చంద్ర తండ్రికి భారత ప్రభుత్వం ప్రదానం చేసిన అశోక చక్ర మెడల్ ఆ దోపిడీలోనే చోరీకి గురవుతుంది. దీంతో చంద్ర కూడా ఆ కేసును ఛేదించేందుకు గాయ‌త్రితో పాటు రంగంలోకి దిగుతాడు.  పోలీసులతో కలిసి దొంగలను వెతికే పనిలో పడతాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను ఓ సైబ‌ర్ నేర‌గాడిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మ‌రి ఈ దోపిడీ వెన‌కున్న ఆ క్రిమిన‌ల్ ఎవ‌రు? ఆ వ్య‌క్తిని చంద్ర ఎలా పట్టుకున్నాడు? అన్నది మిగతా కథ.

విశ్లేషణ:
ఈ సినిమాలో హీరో విశాల్‌  ఎప్పటిలానే యాక్షన్‌ సీన్లలో అదరగొట్టాడు. ప్రతినాయిక పాత్రలో రెజీనా కసండ్రా విలక్షణంగా కనిపించారు. ఇక పోలీసు అధికారిగా శ్రద్ధా శ్రీనాథ్‌ పాత్ర కూడా చక్కగా ఉంది. సీనియర్‌ నటి కె.ఆర్‌. విజయది చాలా చిన్న పాత్రే అయిన ఆమె తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. కాగా, తొలి చిత్ర దర్శకుడైన ఎం.ఎస్‌. ఆనందన్‌ ఈ చిత్ర కథను బలంగా రాసుకున్నట్టు కనిపించదు. దానివల్ల ఈ సినిమా మొదట్లో కాసేపు ఆ తరువాత ఛేజింగులు, హీరో విలన్ల మధ్య రసవత్తర పోరు వంటివి ఆసక్తిగానే ఉన్నా, ఆ తరువాత రిపీట్‌ సీన్లు చూస్తున్న ఫీలింగ్‌ వీక్షకులకు వస్తుంది. నిజానికి, ఫస్టాఫ్‌ కాస్తంత వేగంగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది. కానీ, సెకండాఫ్‌ లో సినిమా వేగం తగ్గింది. కథ అక్కడక్కడే నెమ్మదిగా సాగుతుంది.

ప్లస్ పాయింట్స్ : విశాల్ నటన, ఫస్టాఫ్, సంగీతం
మైనస్‌ పాయింట్స్‌ : సెకండాఫ్‌, సాగదీత సీన్లు 
రేటింగ్: 2.5/5

అత్యంత ప్రముఖమైనవి

‘గ‌జ‌కేస‌రి’గా వస్తోన్న కేజీఎఫ్ ఫేమ్ యశ్.. ఆకట్టుకుంటున్న టీజర్

క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు యువ హీరో యశ్. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ప్ర‌తి సినిమాను జాతీయ మీడియా...

మెగా డాట‌ర్ నిహారిక కొత్త సినిమా.. ముఖ్య పాత్రలో ‘మక్కల్‌ సెల్వన్‌’ విజయ్‌ సేతుపతి

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రలో నటించారు. ఆరుముగ కుమార్‌...

‘నాంది’ 7 రోజుల కలెక్షన్స్: మోత మోగిస్తోన్న అల్లరోడు

టాలీవుడ్ లో వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ.. హీరోగా హవా నడిపిస్తున్న అల్లరి నరేష్.. గత కొన్నేళ్లుగా సరైన హిట్ పడక ఉవ్విళ్లూరుతున్నాడు. విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతున్నా సోలో...

నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ:

నటీనటులు : నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, సంపత్‌ రాజ్‌, పోసాని కృష్ణ మురళీ తదితరులు నిర్మాతలు : వి. ఆనంద...

ఇటీవలి వ్యాఖ్యలు