తమ కెరీర్లో ఒక్కసారైనా శంకర్‌తో సినిమా చేయాలని ఉవ్విళ్లూరే హీరోలు ఎంతోమంది ఉన్నారు. భారీదనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే శంకర్ దర్శకత్వంలో నటించే అవకాశం యువ కథానాయకుడు రామ్‌చరణ్‌కు దక్కింది. అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తవగానే శంకర్ డైరెక్షన్ లో తదుపరి చిత్రాన్ని మొదలుపెడతారు చరణ్. ఈలోపు శంకర్ కూడ ‘ఇండియన్ 2’ పనులు ముగిస్తారు. శంకర్ లాంటి క్రేజీ దర్శకుడితో చరణ్ సినిమా చేస్తుండటంతో ఆయన అభిమానులు ఉబ్బితబ్బిబవుతున్నారు. శంకర్ సినిమాలంటే ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. టేకింగ్, టెక్నాలజీ సంగతులు పక్కనబెడితే కథ విషయంలోనే మెస్మైరైజ్ చేసేస్తారు ఆయన.
ఇదిలా వుంటే సమకాలీన రాజకీయాంశాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. శంకర్ గత చిత్రాల తరహాలో భారీ తనం కనిపించినా ఆయన మార్కు సెట్స్.. అదనపు గ్రాఫిక్స్ అంటూ ఏమీ వుండవని, సమకాలీన రాజకీయ అంశాల్ని ప్రధాన అంశంగా తీసుకుని శంకర్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. బడ్జెట్ కూడా గత చిత్రాల తరహాలో అదుపు తప్పకుండా అనవసరమైన ఖర్చులకు తావులేకుండా ఈ ఈ సినిమాని పూర్తి చేయాలని శంకర్, దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట.
కాగా, పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించబోతున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాని 3డీ ఫార్మాట్లో చిత్రీకరించాలని దర్శకుడు శంకర్ యోచిస్తున్నాడట. మరో వైపు అనిరుధ్‌ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలనే ఆలోచనలో శంకర్ ఉన్నాడనే వార్తలొస్తున్నాయి.