నేచురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీశ్’. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ పిక్చర్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు చిత్రబృందం.
అయితే టక్ జగదీష్ టీజర్ 23 ఫిబ్రవరి సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈక్రమంలోనే ఓ మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇందులో ఊరు ఊరంతా పొలం గట్టుపై నించుని షాక్ లో చూస్తుంటే.. టక్ జగదీష్ మాత్రం గునపం పట్టి సమరంలో దిగుతున్నాడు. కోపంతో ఊగిపోతున్న నాని లుక్ ఆసక్తికరంగా ఉంది.
అయితే ఈ సినిమాలో జగదీష్ నాయుడు అనే పాత్రలో కనిపించి సందడి చేయనున్నాడు నాని. టక్ జగదీష్ చిత్రం మంచి ఎమోషన్స్‌తో కూడిన పూర్తి కుటుంబ నాటక చిత్రంగా రూపొందుతుందని తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. జగపతిబాబు, నాజర్, రావురమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.